Thursday, September 14, 2017

అన్నంలో పొడులు


శనగ పొడి

వేయించిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి direct గ mixi వేయాలి.  చివరలో జీలకర్ర (కావాలంటే వెల్లుల్లి) కలిపి ఇంకోసారి mixi వేయాలి.


పల్లి పొడి

బాoడి లో నూనె లేకుండ పల్లీలు(వేరుశనగ గుళ్ళు)  వేయించి, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి mixi వేయాలి.  చివరలో జీలకర్ర (కావాలంటే వెల్లుల్లి) కలిపి ఇంకోసారి mixi వేయాలి.


నువ్వులపొడి

బాoడి లో నూనె లేకుండ నువ్వులు వేయించి, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి mixi వేయాలి.  చివరలో జీలకర్ర (కావాలంటే వెల్లుల్లి) కలిపి ఇంకోసారి mixi వేయాలి.

కంది పొడి



కంది పప్పు  1 cup

పచ్చి శనగపప్పు  ౩/4 cup

పెసరపప్పు ౩/4 cup

మినపపప్పు  ౩/4 cup


అన్ని పప్పులు విడివిడిగ నూనె లేకుండా (dry roast) వేయించాలి.

పొడి పట్టేటప్పుడు  చివరలో ఉప్పు జీలకర్ర కలిపి ఇంకో సారి mixi వేయాలి.

పచ్చి శనగపప్పు 1 cup, కందిపప్పు ౩/4  ratio కూడా వేసుకోవచ్చు.

చారుపొడి



కందిపప్పు  1 cup

ధనియాలు 2 cups

మిరియాలు 1/2 cup

కొద్దిగా జీలకర్ర (optional)

ఉప్పు

అన్ని ఎండలో కొంచం సేపు వుంచి తగినంత ఉప్పు కలిపి పొడి  చేసుకోవాలి.

చట్ని పొడి



మినప్పప్పు   1 cup

ఆవాలు 1/2 cup

ఎండుమిరపకాయలు 10 నుంచి 15

మెంతులు  కొద్దిగా

ఉప్పు కొద్దిగా


నూనెలో వేయించి పొడి కొట్టుకోవాలి


వేరియేషన్స్:

1/2 cup పచ్చి శనగపప్పు
1/2 cup నువ్వులు
2 స్పూన్స్ జీలకర్ర

ఇవి కావాలంటే కలుపుకోవచ్చు.

కూర ముక్కలు నూనెలో వాడ్చి దానికి పై చట్ని పొడి, చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు, పసుపు కలిపి  పచ్చడి  చేసుకోవచ్చు.

బీరకాయ, వంకాయ, దోసకాయ లాంటి వాటిలో జీల కర్ర వెయ్యచ్చు
కొబ్బరి పచ్చడి లో పచ్చి శనగ పప్పు వెయ్యచ్చు



కూర పొడి



పచ్చి శనగపప్పు  -  1 cup

మినప్పప్పు - 1 cup

పల్లీలు - 1/2 cup

ఎండుమిరపకాయలు  - 15

ధనియాలు 1 spoon

మెంతులు - 1 spoon

జీలకర్ర 1 spoon

ఉప్పు - తగినంత

నూనెలో  పైవన్ని వేయించి పొడి కొట్టుకోవాలి.

కారప్పొడి


ఇడ్లి, దోస లోకి

ధనియాలు - 1 cup
మినప్పప్పు
 (with husk is better option) - 1/4 cup
పచ్చి శనగపప్పు  - 1 spoon (optional)
ఎండుమిరపకాయలు- 10/12
చింతపండు -తగినంత
ఉప్పు - తగినంత
వెల్లుల్లి - 5/6 రెబ్బలు



నూనెలో ముందు శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి.

చివరగా ధనియాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి.

దీనికి చింతపండు, ఉప్పు, వెల్లుల్లి  కలిపి మిక్సీలో వెయ్యాలి.



కరివేపాకు కారప్పొడి

పై కారప్పొడి లో ధనియాలు తక్కువగా (2 spoons)  మాత్రమే వేసి కరివేపాకు ఎక్కువగా వేసి పొడి పట్టుకోవాలి.



అన్నంలోకి
ఎండుమిరపకాయలు- 10/12
చింత పండు
మినప్పప్పు 1 spoon
పచ్చి శనగపప్పు 1 spoon
ధనియాలు 1 spoon
కరపాకు కొంచం